Fair Accident: వరంగల్ లో రాత్రి జకోటియా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. వికారాబాద్ లో ఓ దుకాణంలో షార్ట్ షర్క్యూట్ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని యాబాజి గూడెం గ్రామంలో నారాయణ కిరాణా దుకాణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు లేచి చూడగా దుకాణంతో పాటు ఇళ్లు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ వ్యక్తులు మరో డోర్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసారు. దీంతో వాళ్లకు ప్రాణాపాయం తప్పింది. బయటకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి వారికి సహాయం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే.. ఇంట్లో ఉన్న కిరాణా సామాగ్రి, విలువైన వస్తువులు పూర్తిగా తగలబడిపోయాయి దగ్ధమయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పారు. దీంతో మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికి ఏమాత్రం ప్రాణ నష్టం కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
వరంగల్ లో రాత్రి జకోటియా కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన తెలిసిందే.. ఇదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఉదయం మళ్లీ పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది. కాంప్లెక్స్ మొత్తాన్ని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పై ఉన్నతాధికారులు రివ్యూ చేయన్నారు. ఫర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే జిడబ్ల్యుఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు 9 గంటల పాటు ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేశారు. కాంప్లెక్స్ లో జనాన్ని బయట తీసుకొచ్చే క్రమంలో ఫైర్ కానిస్టేబుల్ సిఐ గోపి అస్వస్థకు గురయ్యారు. దీంతో గోపిని హుటా హుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకేరోజు రెండు అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజాలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భాయంతో జంకుగుతున్నారు.
Read also: Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
ఇక మరోవైపు శంషాబాద్ రాళ్లగూడ వద్ద కేజీఎన్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాం కి పక్కనే ఆనుకుని ఉన్న ప్రియాంక గ్యాస్ ఏజెన్సీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్క్రాప్ గోదాం నుండి గ్యాస్ ఏజెన్సీకి మంటలు వ్యాపించాయి. గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 50 నుండి 100 వరకు సిలిండర్లు ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది హుటాహుటిన సిలిండర్లను బయటకు తరలిస్తున్నారు.
Inspector Rishi OTT: ఓటీటీలోకి వచ్చేసిన నవీన్ చంద్ర హారర్ క్రైమ్ థ్రిల్లర్..!