NTV Telugu Site icon

Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు

Brs Pracharam

Brs Pracharam

తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. నేతల దగ్గర్నుంచి మొదలుపెడితే కార్యకర్త వరకూ ప్రచారంలో జోష్ పెంచారు. సమయం తక్కువ ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందు కోసం చూస్తుండగా, ఈ సారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది హస్తం పార్టీ.. మరోవైపు బీజేపీ కూడా తమ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది.

Anchor Suma: తలుపు తీయకపోతే.. రాత్రంతా మెట్లపై నిద్రపోయేది..

ఇదిలా ఉంటే ప్రచారంలో జోరు పెంచిన నేతలు, కార్యకర్తలు.. ఓటర్లను ఆకర్షించేలా తమ ప్రచారాన్ని చేస్తున్నారు. తాజాగా ఆర్మూర్ లో ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. ఆర్మూర్ లో రోడ్ షో సందర్భంగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి పెను ప్రమాదం జరుగకపోవడంతో పార్టీ నేతలు, శ్రేణులందరూ ఊపిరీ పీల్చుకున్నారు.

Sama Ranga Reddy: కాషాయమయమైన ఎల్బీనగర్.. భారీ జన సంద్రం నడుమ నామినేషన్

తాజాగా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా గణేష్ మండపం కుప్పకూలింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు. ప్రాణపాయం ఏమీ లేకపోవడంతో పెద్దముప్పు తప్పింది. మరోవైపు క్షతగాత్రులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శించారు.

Show comments