Warangal Rocket Launch : తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న ‘రుద్రమ’ రాకెట్..
- ఓరుగల్లులో తొలి మోడల్ రాకెట్ ప్రయోగం
- ‘రుద్రమ’ రాకెట్‌కు రాణి రుద్రమదేవి పేరు
- విద్యార్థులకు సైన్స్ అవగాహన సదస్సు
- భద్రకాళి ట్యాంక్ బండ్‌పై స్టార్ గేజింగ్ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal’s Space Odyssey : వరంగల్ చారిత్రక నగర కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న ఓరుగల్లు గడ్డపై మొట్టమొదటిసారిగా ఒక మోడల్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ అద్భుత ఘట్టం, అటు విద్యార్థుల్లో ఇటు సామాన్య ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానంపై సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇస్రో స్పేస్ ట్యూటర్ , ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టుకు వరంగల్ నిట్ , కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాయి.
Relationship Issues: వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు.. బాడీబిల్డర్ ఏం చేశాడంటే?
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి సాహసానికి ప్రతీకగా ఈ మోడల్ రాకెట్‌కు ‘రుద్రమ’ అని నామకరణం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానం ఈ చారిత్రక ప్రయోగానికి వేదిక కానుంది. ఈ ప్రయోగానికి ముందు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సైన్స్ , అంతరిక్షంపై విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సు ముగిసిన వెంటనే ‘రుద్రమ’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి , భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల వైపు వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
కేవలం రాకెట్ ప్రయోగంతోనే ఆగకుండా, ఖగోళ ప్రియుల కోసం మరిన్ని ఆసక్తికరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భద్రకాళి ట్యాంక్ బండ్‌పై ప్రత్యేకంగా టెలిస్కోపులను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా నక్షత్రాలను, గ్రహాలను వీక్షించే (స్టార్ గేజింగ్) అరుదైన అవకాశం నగరవాసులకు కలుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేందుకు పాఠశాల , కళాశాల విద్యార్థులకు, అలాగే ఆసక్తి గల వారికి ప్రవేశం పూర్తిగా ఉచితం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జరుగుతున్న ఈ వేడుకలు నగరంలో సైన్స్ పట్ల సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.
RAPO : రామ్ పోతినేని ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్
Unveiling the Rocket
“Rudrama V.01” –
On the occasion of National Science Day, 28 February, ATDRL Space Research Lab a startup based in Warangal in association with Kakatiya Urban Development authority (KUDA) will host the first public model rocket launch at Kaloji… pic.twitter.com/jNNIK7Q9qJ— Venkatram Reddy Engala (@EVenkatReddy) February 3, 2026
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!