Warangal Preethi Case: పూలదండ ఎందుకు తెచ్చావ్.. నిలదీసిన ప్రీతి సిస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Preethi Sister Questioned Governor Tamilisai: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను ఆమె కజిన్ సిస్టర్ నిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది. గవర్నర్ లాంటి హోదాలో ఉండి మీరేం చేస్తున్నారు? అని మండిపడింది. ఒక సమాజాన్ని కాపాడే డాక్టర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మీరేం చేస్తున్నారు? వచ్చి పూలదండలు వేసిపోతారా? అని ఫైర్ అయ్యింది.
Errabelli Dayakar Rao: ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తమకు కావాల్సింది ఓదార్పు కాదు, న్యాయమని పేర్కొన్న యువతి.. ఈ ఘటనపై ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. పరామర్శించేందుకు వచ్చామని మీడియా ముందు పబ్లిసిటీ చేసుకోవడం కాదని.. మీకు చేతకాకపోతే తామే స్వయంగా కమిటీ వేసుకొని, తమ అక్కకు ఏం జరిగిందో తెలుసుకుంటామని సవాల్ విసిరింది. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి ఘటనలే ఎదురైతే.. మీరు పూలదండలతో వెళ్తారా? అని ప్రశ్నించింది. స్పెషల్ కమిటీ వేయాల్సిందేనని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందేనని ప్రీతి సిస్టర్ కోరింది. హార్ట్ ఫంక్షనింగ్ లేకపోయినా, ఫంక్షనింగ్ ఉందంటూ ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శించేందుకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని, స్పెషల్ కమిటీ వేసి ఒక గంటలోనే రిజల్ట్ తీసుకురావాలని ఆ యువతి డిమాండ్ చేసింది.
Kodali Nani vs Chandrababu: నేను, వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీ నా బాబు?
మరోవైపు.. ప్రీతి సిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్ భవన్ స్పందించింది. నిమ్స్ వెళ్లిన సమయంలో గవర్నర్ వాహనంలో పూలదండ ఉండటంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. హనుమంతుని గుడిలో సమర్పించడానికి గాను కారులో పూలదండ ఉంచడం జరిగిందని స్పష్టం చేసింది. అంతే తప్ప.. దానిపై విపరీతార్ధాలు తీయటం సహేతుకం కాదని రాజ్ భవన్ తెలిపింది. అంతేకాదు.. హనుమంతుని గుడిలో వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కూడా గవర్నరు ప్రార్ధన చేశారని క్లారిటీ ఇచ్చింది. రాజ్ భవన్‌కు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి మెడికో సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందిగా ఒక లేఖ ద్వారా ఆదేశించారని వెల్లడించింది. గవర్నరు నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్ధం చేసుకోవాలని రాజ్ భవన్ విజ్ఞప్తి చేసింది.
Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!