Medico Preethi: డాక్టర్ ప్రీతి కేసు.. అవును అలా చేసింది నేనే సైఫ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medico Preethi: సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్, ప్రీతిని ర్యాగింగ్ చేసిన మాట వాస్తవమేనని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 26న ప్రీతి మరణం తర్వాత సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని పోలీసులు చెప్పగా, అతను దానిని ఖండించాడు. తాను ర్యాగింగ్ చేయలేదని, అయితే అది ర్యాగింగ్ కాదని వాదించాడు. అయితే, పోలీసులు అతని వాట్సాప్ చాట్లను తీసి, సైఫ్ ఉద్దేశపూర్వకంగా ర్యాగింగ్‌కు పాల్పడ్డాడని నిర్ధారించారు. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో సైఫ్ ను ఆధారాలు చూపి ప్రశ్నించగా ర్యాగింగ్ నిజమేనని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో సైఫ్‌ను ఈ నెల 6న కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నేరాంగీకార నివేదికలో సైఫ్ ర్యాగింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు.
వరంగల్ పోలీసు కమీషనర్ సీపీ ఏవీ రంగనాథ్ ఎంట్రీ..
Also Read
- iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్‌లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ప్రీతి మరణంపై నిజనిజాలు తేల్చేందుకు వరంగల్ పోలీసు కమీషనర్ సీపీ ఏవీ రంగనాథ్ స్వయంగా కేసు విచారణ చేపడుతున్నారు… సైఫ్‌ను అరెస్టు చేసిన రోజు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి పరిపాలనాధికారులతో ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న వరంగల్ సీపీ బుధవారం సాయంత్రం మరోమారు ఎంజీఎంని సందర్శించారు. అక్కడ క్షత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.. ప్రీతి అపస్మారక స్థితికి వెళ్లకముందు విధులు నిర్వర్తించిన ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, అపస్మారక స్థితిలోకి వెళ్లిన గదిని పరిశీలించారు. అంతేకాకుండా ప్రీతితో వైద్యవిద్యనభ్యసిస్తున్న సహచరులను, సీనియర్ పీజీ విద్యార్థులను విచారించారు. సుమారు రెండు గంటల పాటు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.
మరో వైపు ప్రీతి ఘటన వరంగల్ పోలీస్‌లకు సవాల్‌గా మారింది. ఈ ఘటనపై నేషనల్ మెడికల్ కౌన్సిల్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా సద్దుమణగలేదు. ప్రీతి అనస్తీషియా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్న క్రమంలో టాక్సికాలజీ నివేదికలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదనే విషయం వెల్లడి కావడంతో ఈ ఘటనపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రీతిని హత్య చేశారని కుటుంబ సభ్యులు బలంగా ఆరోపిస్తున్న క్రమంలో ఈ కేసును చేధించేందుకు స్వయంగా కమిషనరే రంగంలో దిగి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతి కేసులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒకటి, రెండు మార్లు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో ఆ రోజు ఏం జరిగిందోననే విషయాన్ని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీ రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఆస్పత్రిలో ఆ సమయంలో విధుల నిర్వర్తించిన వైద్యులను, వైద్యసిబ్బందిని సైతం పోలీసులు ఇప్పటికే విచారించారు. ప్రీతి, సైఫ్ మొబైల్ ఫోన్ల నుంచి లభిస్తున్న సాంకేతిక ఆధారాలను సరిపోలుస్తూ ప్రీతి మరణం వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీస్ కమిషనర్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!