Dialogue War: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్న ప్రదీప్ రావు వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఎదో చెప్తే దానికి భయపడి వెనక్కిపోయేది లేదు.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు సన్యాసికి తెలియదు.. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ రూ. 10 కోట్ల ఇష్యూ సాల్వ్ చేసాను.. సంతోషంగా అందులో ఉన్న ఓ తల్లి ఈసారి ఎన్నికలకు డబ్బులు ఇస్తామన్నది.. వద్దు తల్లి, నేనే మొన్న రూ. 70 కోట్ల భూమి అమ్ముకున్న అన్నాను.. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని కొండా మురళి వెల్లడించారు.
Read Also: MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
ఇక, ఎర్రబెల్లి కుటుంబమే ఓ దరిద్రమైన కుటుంబం అని కొండా మురళి విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన మహిళలు, పురుషులు దరిద్రులే.. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావు ఇద్దరు అన్నదమ్ములు పెద్ద దరిద్రులు.. వాళ్ళు ఏదో అన్నారని నేను భయపడను అని చెప్పుకొచ్చారు.
