NTV Telugu Site icon

Konda Surekha: వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ..

Konda Suresha

Konda Suresha

Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారు.. సీఎం టూర్ పై ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో రివ్యూ చేశాము.. మధ్యాహ్నం 1 వరకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుని పరిశీలిస్తారు.. ఆ తరువాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి అధికారుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటారు.. అనంతరం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఉంటుంది అని తెలిపారు. ఇక, రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ ఉంది.. మాస్టర్ ప్లాన్ అంశం చర్చకు వస్తాయి.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసింది అని అర్థం అయ్యింది.. దాన్ని మార్చాల్సి ఉంది అని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Read Also: T20 World Cup 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..

ఇక, మూడు నెలల కాలవ్యవధి పెట్టి మాస్టర్ ప్లాన్ తయారీ చేసే అంశం ఉంటుంది అని మంత్రి సురేఖ అన్నారు. స్మార్ట్ సిటి పనుల అంశంపై చర్చించే అవకాశం ఉంది.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తాం.. అలాగే కేబుల్ కూడా అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేస్తారు.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం.. దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాము.. ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే చేశారు.. ఈ అంశం చర్చకు వస్తుంది.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీ అతి త్వరలో స్వాధీనం చేసుకొని రోగుల అందుబాటులో తెచ్చే అంశంపై చర్చిస్తాం.. ఈ హాస్పిటల్ కేవలం 12 అంతస్తులు మాత్రమే రోగులకు వాడాలి.. దీన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.. మమూనూర్ ఎయిర్ పోర్ట్ అంశం కూడా చర్చకు వస్తుంది.. సీఎం దృష్టి తీసుకెళ్ళి ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగుతుంది.. రూ. 20 కోట్ల లోన్ రేపు మహిళ శక్తి రుణాల ఇస్తారు.. కాళోజీ కళ కేత్రం పనుల ఆలస్యం పైనా చర్చిస్తాం.. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు చర్చకు వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.