Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మళ్లీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బీహార్‌తో పాటు, ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాతావరణంలో వేడి, తేమ ఉంది. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షం బీభత్సంగా మారింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ వరదలు, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో మధ్యాహ్నం మంచి వర్షం కురిసింది. దీంతో సాయంత్రం పూట వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అయితే అర్థరాత్రి తేమశాతం పెరిగింది. మరోవైపు ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, బీహార్‌లో రోజూ రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీహార్‌లోని డజను జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది.
Read Also:IND vs ZIM: అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత్!
నదుల్లో నీరు అధికంగా చేరడంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారత వాతావరణ శాఖ ఢిల్లీ కేంద్రం ప్రకారం, ఢిల్లీలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం కొన్ని చోట్ల తేలికపాటి వర్షం, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also:Off The Record: కాంగ్రెస్‌లో పాత వర్సెస్ కొత్త వార్..! వివాదాస్పద రాజకీయాలకు కేరాఫ్ ధర్మపురి..
అదేవిధంగా జమ్మూకశ్మీర్, లడఖ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ రాష్ట్రంలో గురువారం కూడా చాలా చోట్ల వర్షాలు మరియు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈరోజు మళ్లీ ఇక్కడ పిడుగులు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.