Site icon NTV Telugu

Ex MLA Aroori Ramesh: ఢిల్లీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..! అందుకేనా..?

Ex Mla Aroori Ramesh

Ex Mla Aroori Ramesh

Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడే నేతలను బుజ్జగిస్తున్నా రాజకీయాల్లో భాగంగా జంప్ చేస్తున్న జంప్ జిలానీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ఆరూరి రమేశ్ కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు రోడ్డుపై పోరాడిన ఘటనలు మరువకముందే ఆరూరి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, బలవంతంగా తీసుకెళ్లలేదని, తానే హైదరాబాద్‌కు వచ్చానని, కేసీఆర్ వద్దకు స్వయంగా నేనే వచ్చానని ఆరూరి రమేష్ అన్నారు. తాను అమిత్ షాను కూడా కలవలేదని మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారు కూడా.. అయితే.. అమిత్ షాను కలిసేందుకు ఆరూరి రమేష్ వెళ్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక మరోవైపు నిన్న కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో తుది అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే.. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

Read also: Google + AI : ఆండ్రాయిడ్ వినియోగదారులకు అద్భుతమైన ఏఐ ఫీచర్స్.. అవేంటంటే?

ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కె.కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటన చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. అయితే వరంగల్ లోక్ సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ వార్త తాజా పరిణామాలతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఈరోజు ఢిల్లీలో వరంగల్ లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం కోసం ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని టాక్. బీజేపీ నేతలతో కలిసి ఆరూరి రమేష్.. బీజేపీలో చేరనున్నారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. నిన్నటి రచ్చ తర్వాత ఆయన చేరికపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏది ఏమైనా వరంగల్ లో ప్రస్తుతం అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తున్నాయి.
Google + AI : ఆండ్రాయిడ్ వినియోగదారులకు అద్భుతమైన ఏఐ ఫీచర్స్.. అవేంటంటే?

Exit mobile version