NTV Telugu Site icon

Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో

Mlc Vs Talasani

Mlc Vs Talasani

War Of Words Between Jeevan Reddy Talasani Srinivas Yadav: తెలంగాణ అసెంబ్లీలోని శాసనమండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల మధ్య ఒక మినీ యుద్ధమే చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ ప్రశ్నపై సభ్యులు, మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి తలసాని మధ్యలో కల్పించుకొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో పాలకు ఎవ్వరూ ఇన్సెంటివ్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇందుకు జీవన్ రెడ్డి బదులిస్తూ.. నువ్వు ముందు నీ శాఖకు సంబందించిన పనులు చూసుకో అని, తర్వాత వేరే శాఖ మీద మాట్లాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆల్రెడీ ఎస్సీ వెల్ఫేర్ గురించి మాట్లాడానని, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టున్నావని ఎద్దేవా చేశారు. నీ శాఖలో పాలకు ఇన్సెంటివ్ రూ.4 ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అవుతుందని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పు అని నిలదీశారు. ఇంతలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకొని.. ఒక లీటర్ పాలకు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం కేసిఆర్‌ను కోరితే.. రూ. 4 ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….

అంతకుముందు.. బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వసతుల కల్పన చేయకపోవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బదులిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని, తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 5 లక్షల 31 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. 268 ఎస్సీ గురుకులాల్లో 1,53,863 మంది విద్యార్థులు, 310 బీసీ గురుకులాల్లో 1,65,110 మంది, 183 ఎస్టీ గురుకులాల్లో 72,898 మంది, 204 మైనారిటీ గురుకులాల్లో 125218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. గురుకుల పాఠశాల పని వేళల మార్పుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్స్‌కు పదోన్నతుల కల్పన ఆలోచన లేదన్నారు. గురుకులాలకు అద్దె భవనాలు సమస్య కాదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి.. దశల వారిగా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు

Show comments