NTV Telugu Site icon

Crime News: బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన నిందితులు

Vikarabad

Vikarabad

డబ్బు, బంగారం కోసం దుండగులు ఎంతటి దానికైనా తెగిస్తున్నారు. వృద్ధులు, పెద్దలు, చిన్న పిల్లలు అని తేడా లేకుండా చంపేస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా.. బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Read Also: Mahua Maji: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. జేఎంఎం ఎంపీకి తీవ్రగాయాలు

వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు. అదే గ్రామానికి చెందిన రాజు, నర్సింలు, షఫీయుద్దీన్ ఈ ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న బంగారం.. 21,000 నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వృద్ధురాలు నిద్రలో నుంచి లేచి ఆ ముగ్గురిని చూసి అరిచింది. తాము చోరీ చేసిన విషయాలు బయటకు చెప్తుందని భావించి ముగ్గురు కలిసి వృద్ధురాలిని చంపేసి ఇంట్లోనే ఉన్న బావిలో గుర్తు పట్టకుండా పడేశారు. అంతేకాకుండా.. వారి ఆనవాళ్లు తెలియకూడదని ఇంట్లో ఉన్న బీరువాను తగలబెట్టేశారు.

Read Also: Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్

అదే గ్రామానికి చెందిన స్థానికులు.. ఈ ముగ్గురు వినోద ఇంటి చుట్టూ అర్ధరాత్రి తిరగడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. పోలీసులు చాలా చకచక్యంగా ముగ్గురును అరెస్ట్ చేసి విచారించగా వృద్ధురాలి వినోదను తామే డబ్బు, బంగారం కోసం హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. మృతురాలి కుమార్తె విమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి పోలీసులు బంగారం లాకెట్, రూ.21,000 స్వాధీనం చేసుకున్నారు.