NTV Telugu Site icon

Lagacharla Industrial Park: లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..

Lagacharla Industrial Park

Lagacharla Industrial Park

Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్క్‌ను వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లాగాచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నియమించింది. ఇటీవల రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో గతంలో ఇక్కడి ఫార్మా గ్రామాల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యంగా మారతాయని లగచర్ల ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో కాలుష్య రహిత సంస్థలు నెలకొల్పితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Read also: OTS Scheme: నేటితో ముగియనున్న ఓటీఎస్ ఆఫర్.. రేపటి నుంచి బాదుడే

దీంతో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దుద్యాల మండలంలోని లగచర్లలో, పోలేపల్లిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్ లో భాగంగా టెక్స్ టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెక్సైల్ కంపెనీ ఏర్పాటు చేసినా.. ఇక్కడ పొల్యూషన్ ఉండదని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..

Show comments