వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఎంత పెద్ద వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌తో పాటు.. అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని అన్నారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్‌ని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ పై ఇతర అధికారులపై దాడి చేశారని ఐజీ పేర్కొన్నారు.
Read Also: Asian Hockey Champions Trophy: తొలి మ్యాచ్‌లో మలేషియాపై భారీ విజయం సాధించిన భారత జట్టు
ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని.. పోలీసు విచారణ చేస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించమని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఐజీ తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Read Also: Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్‌తో కాల్చిన ప్రియుడు
అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని.. మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డికి బలమైన గాయాలు అయ్యాయని.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై దాడి చేశారన్నారు. లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారుల పైన ఇలాంటి దాడులు జరగడం విచారకరమని ఐజీ అన్నారు.