Boat Capsized : వికారాబాద్ జిల్లా సర్పన్ పల్లి ప్రాజెక్ట్ వద్ద జరిగిన బోటు ప్రమాదం కేసులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. “ది వైల్డర్ నెస్” రిసార్ట్ కు వచ్చి బోటింగ్ చేసిన పర్యాటకుల్లో ఇద్దరు మహిళలు – రీటా కుమారి (55), పూనం సింగ్ (56) – బోటు బోల్తా పడిన ఘటనలో మృత్యువాతపడ్డారు. వారిని తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలుపలేకపోయారు.
Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్ టార్గెట్ అదే.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాలు సంచలనంగా మారాయి. ఆ రిసార్ట్ కు అవసరమైన అధికార అనుమతులు లేవని, బోటింగ్ కోసం కూడా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా బోటింగ్ చేస్తున్న వారికి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
కనీస భద్రతా చర్యలు లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసమే ఈ రిసార్ట్ నిర్వహకులు బోటింగ్ నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులే కాదు, పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఘటన పర్యాటకుల భద్రతపై ప్రభుత్వాన్ని ఆలోచింపజేసేలా మారింది.
Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్ టార్గెట్ అదే.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!