Site icon NTV Telugu

Vijayashanthi: కేసీఆర్‌వి పగటి కలలే.. కేంద్రంలో మేమే.. తెలంగాణలో వచ్చేది మా సర్కారే..!

Vijayashanthi

Vijayashanthi

ప్రధాని పదవి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలే.. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యం అన్నారు.. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు.. గార్బేజ్ హైదరాబాద్ లా ఉందని మండిపడ్డారు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తమయం, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశారన్న ఆమె.. హైదరాబాద్ సందుల్లో ఎక్కడ చూసినా… కచరానే దర్శనమిస్తోంది.. వర్షాలు వస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి.. దోమల నిర్మూలనకు మందు కూడ కొట్టడం లేదని ఆరోపణలు గుప్పించారు.

Read Also: Etela Rajender: కేసీఆర్‌ను సభకు రాకుండా చేసే బాధ్యత నాదే.. ఈ ప్రభుత్వం ఫీజు పీకాల్సిందే..!

తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు విజయశాంతి… రోడ్లు, డ్రైనేజీ, నాలాల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్న ఆమె.. కేసీఆర్ పాలన అతి నీచంగా ఉందంటూ ఫైర్‌ అయ్యారు.. కేసీఆర్ ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించని కారణంగా, పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ అమలు చేయడం లేదు.. తెలంగాణను సర్వనాశనం చేసి దోచుకు తింటున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులను ఆదుకోని కేసీఆర్.. పక్క రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారని విమర్శించారు.. నీలాంటి నీచుడితో ఉద్యమంలో పాల్గొన్నందుకు సిగ్గుతో లెంపలేసుకుంటున్నానని వ్యాఖ్యానించిన ఆమె… ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.. కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా… నరేంద్ర మోడీని ఏమీ చేయలేరు.. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని.. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి..

Exit mobile version