కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక.. రాములమ్మ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మరోసారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అలియాస్ రాములమ్మ.. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై దాడిని ఊటంకిస్తూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డారు.. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదురించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను… కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత… లేకుంటే ఎంత? అని ప్రశ్నించిన రాములమ్మ,. రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గుండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు… పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేదు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ…. మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం అని హెచ్చరించారు విజయశాంతి.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
-
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
-
China: “మనం శత్రువులం కాము”.. భారత్‌కు చైనా సందేశం..
-
INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్‌డాగ్’ టీజర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!