Venkaiah Naidu: పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని నార్సింగి ఓం కన్వెన్షన్ లో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం కార్యక్రామానికి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా మోస్ట్ సెక్యులర్ కంట్రీ అంటూ వ్యాఖ్యానించారు. బీబీసీ వాళ్ళు మన దేశాన్ని.. ప్రధానిని తక్కువ చేసి ఓ డాక్యుమెంటరీ చేసారు. అది కేవలం ప్రధానిని మాత్రమే కాదు.. దేశాన్ని తక్కువ చేయడమన్నారు. మనం మన భాషను కాపాడుకోవాలన్నారు. మన భాషను కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుని వెళ్లిపోయారని అన్నారు. వారి భాష పద్దతులను మనం నేర్చుకున్నామని, కన్నతల్లి.. మాతృ భాష.. పుట్టిన ఊరు.. దేశాన్ని మరిచిన వాడు మనిషే కాదని అన్నారు.
Read also: Che Guevara Daughter: నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి
మన భాష సంస్కృతులను అలవర్చుకోవడం మన ధర్మమని, మన దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. మరో పదేళ్లలో దేశం ఆర్థిక శక్తిగా మారుతుందని.. ప్రపంచంలో ఒకప్పుడు మనది ధనిక దేశమన్నారు. నూతన విద్యా విధానంలో మాతృ భాషను కాపాడుకునే వీలు కల్పించిందని పేర్కొన్నారు. SSC పరీక్షలు మాతృ భాషల్లో రాయడానికి అవకాశం కల్పించినందుకు అభినందించారు. పరిపాలన కూడా మాతృ భాషలోనే జరగాలి.. ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలన్నారు. చట్టసభల్లో కోర్టుల్లో మాతృ భాషాల్లో మాట్లాడాలని, కోర్ట్ లో ఉత్తర్వులు.. వాదనలు మాతృ భాషాల్లో జరగాలన్నారు. నేను రాజ్యసభ ఛైర్మెన్ గా ఉన్నప్పుడు సభ్యులకు మాతృ భాషల్లో మాట్లాడే అవకాశం ఇచ్చానని తెలిపారు. పిల్లల్ని చెడగొడుతుంది తల్లిదండ్రులే.. మమ్మీ డాడీ అని పిలిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. పదవీ విరమణ మాత్రమే చేశాను కానీ.. పెదవి విరమణ చేయలేదన్నారు. నా అనుభవాల్ని ఆలోచల్ని అందరికి అందించడానికి పని చేస్తున్ననని వెంకయ్యనాయుడు సభలో వివరించారు.
Read also: Harish Rao: సీఎస్‌ఎస్ నిధులు ఇప్పించండి.. కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి చాలా గొప్పది.. అందులో భాగమే పండుగలు అన్నారు దత్తాత్రేయ. తెలుగు భాష అమ్మ భాష అన్నారు ఆయన. తెలుగుని ప్రాచుర్యం చేయాలి.. ఎక్కడికెళ్లినా మాట్లాడాలన్నారు. మాతృ భాషలో విద్యాభ్యాసాన్ని చేయాలనీ విద్యావిధానం తీసుకువచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అందరూ తెలుగుని మాట్లాడాలి.. ఇతరులకు తెలుగుని నేర్పించాలని హర్యానా గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజు, ఆకెళ్ల విభీషన శర్మ, బీజేపీ నేత మురళీధర్ రావు పాల్గొన్నారు.
Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం