సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆయన మట్లాడుతూ అమిత్ షాపై మండి పడ్డారు. తెలంగాణకు నువ్వేమిచ్చావో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణలో ఏమ్ పీకడానికి వచ్చాడని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు మోదీ దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మేము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు.
కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలను సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాకారం చేస్తున్నారని అన్నారు. డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటామంటే నష్టపోతారని, చాలా పారదర్శకంగా ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
జిహెచ్ఎంసిలో 23 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు పూర్తి అయ్యాయి. అందులో ఏడు కాలనీలు సనత్ నగర్ నియోజకవర్గంలో పూర్తి అయ్యాయని తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని కేటీఆర్ భావించారు. 60 వేల ఇండ్లు పూర్తీ దశకు వచ్చాయి. 40 వేల ఇండ్లు త్వరలో పూర్తీ అవుతాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కాగా.. అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టిఆర్ఎస్ సిద్ధం మని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా ఏదైనా మాట్లాడుతమంటే చెల్లదని మండి పడ్డారు. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళుండి చూడలేని కాబోదులు బీజేపీ నాయకులంటూ మండిపడ్డారు.
మంత్రి పదవులు అన్ని కేసీఆర్ కుటుంబానికి అన్న అమిత్ షా.. మిగతా మంత్రులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం, మీరు గెలుస్తారో, మేము గెలిస్తామో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. గుజరాత్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
Naga Babu: అభిమానులకు రిక్వెస్ట్.. దయచేసి ఆ వార్తలు నమ్మవద్దు