Site icon NTV Telugu

VH: రేవంత్‌పై వీహెచ్‌ ఫైర్‌.. పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..?

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆయన.. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వల్లనే రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇలా అయితే, పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..? అని నిలదీశారు.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లను కూడా పక్కన పెడుతున్నాడని విమర్శించిన వీహెచ్… ఈ విషయాలను అధిష్టానానికి చెబుతాం అంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే మీడియాతో మాట్లాడాల్సి వస్తుందన్నారు వీహెచ్.

Read Also: KCR in Jharkhand: గ‌ల్వాన్ అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం

బీహార్ వాళ్లను కించ పరిచేలా మాట్లాడుతున్నారు అంటూ రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వి. హనుమంతరావు.. బీహార్‌లో తెలంగాణ వాళ్లు పని చేయడం లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. బీహార్‌ నుంచి నాకు ఫోన్స్‌ వస్తున్నాయని తెలిపారు.. ఒక ప్రాంతం వారిని విమర్శించడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు.. మరి, ఆంధ్ర అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.. వాళ్ల గురించి ఎందుకు మాట్లాడడంలేదు? అని నిలదీశారు వీహెచ్. కాగా, గత కొంత కాలంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను టార్గెట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version