NTV Telugu Site icon

V.Hanumantha Rao : పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమయ్యింది

Vh On Kcr

Vh On Kcr

ప్రజల సెంటిమెంటుతో గెలిచిన కేసీఆర్ గెలిచిన తరువాత టీఆర్ఎస్ అని ఉన్న పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమయ్యింది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు అన్నారు. మర్యాద పూర్వకంగా బాగ్ అంబర్ పేట్‌లోని వి.హనుమంతరావు ను ఆయన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసాడు. ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి సోనియా గాంధీ చెలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.

Also Read : Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!

అలాంటి కాంగ్రెస్ కు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత పొంగులేటి మొదటి సారిగా నన్ను కలిసి నందుకు సంతోషంగా ఉంది అన్నారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసి కాంగ్రెస్ ను అధికారం లోని తెస్తామని అన్నారు. పార్టీలో అందరితో కలిసి పనిచేయాలనే ఆలోచనతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని, ఆయనకు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషమన్నారు వీహెచ్‌.

Also Read : RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..

కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మరిచారని, అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను విడిచి కాంగ్రెస్ లో చేరారని ఆయన వెల్లడించారు. పార్టీలో నా పూర్తి మద్దతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఉంటుందని స్పష్టం చేశారు వీహెచ్‌. రాష్ట్రంలో మార్పు ఖాయమని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లతామని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.