NTV Telugu Site icon

Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..

Uttarakhand Cm Pushkar Singh Dhami

Uttarakhand Cm Pushkar Singh Dhami

Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కిషన్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. గత 45 ఏళ్లుగా ప్రజాజీవనంలో నిష్కళంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డిని మించిన సరైన అభ్యర్థి ఇంకెవరుంటారు? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించాను. ఆ పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశమంతా మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్ట చేస్తోందన్నారు.

Read also: Ragidi Laxma Reddy: ఎన్ని కుతంత్రాలు చేసిన గెలుపు మాదే..

13వ తేదీ ఎన్నికల కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి పోటీయే లేదన్నారు. మోడీ గెలుస్తారు, కిషన్ రెడ్డి గెలుస్తారని మనకు అర్థమైందన్నారు. నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు.. కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లండన్నారు. కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయింది.. కమల వికాసం కొనసాగుతుందన్నారు. మేం ఉత్తరాఖండ్ లో ‘ల్యాండ్ జిహాద్’పై కఠినంగా చర్యలు తీసుకున్నామన్నారు. 5వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నామన్నారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలి.. అందుకే UCCని మేం తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రంగా నిలిచామన్నారు.

Read also: G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?

అంబేడ్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. తుష్టీకరణ రాజకీయాలకోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తామని అంటుందన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోడీ చెప్పారని తెలిపారు. మోడీ కన్నా గ్యారంటీ ఇంకే కావాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలన్నారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని మండిపడ్డారు.
KTR: పద్మారావు గౌడ్ను గెలిపించి.. కాంగ్రెస్, బీజేపీకి బుద్ది చెప్పాలి..