Uttam Kumar Reddy : సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలి
- సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ
- సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదన
- సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు.
సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలని, పంప్ హౌస్ 4 నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని మంత్రుల ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, పనుల సమయపాలనపై అధికారులు, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి, పనులను మరింత వేగవంతం చేయాలి. ప్రాజెక్ట్ పనుల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రాబోయే మూడు సంవత్సరాలలో బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ బ్యారేజీ ద్వారా 500 MW – 600 MW విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గోదావరి జలాలతో సస్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కీలకం కానుందనీ మంత్రి తుమ్మల స్పష్టం చేసారు.భవిష్యత్ లో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్ట్ జీవధార గా నిలుస్తుందని, జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్ కు గోదావరి నీళ్ళు చేరితే భవిష్యత్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వర ప్రదాయనిగా మారుతుందని మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు వివరించారు. ఇరువురు మంత్రులు దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం రైతాంగం మేలు కోసం సాగు నీటికి బాటలు వేసే పనులు పై కీలక విషయాలు చర్చించినట్లు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!