తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం మీద మాట్లాడే అంతా గొప్పొడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు ఉత్తమ్.. పని చేసే వారికే ఈ సారి అదిష్టానం టికెట్లను ఇస్తుందని ఆయన వెల్లడించారు.
ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్.. బఫూన్ అని.. అంత మొనగాడు అయితే… మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఓడిపోయిన వ్యక్తి.. కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడుతున్నాడన్నారు. రాజ్య సభ సీటు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.