Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uspc Agitations On March 23 For Pending Salaries

USPC Agitations: విడుదల కాని వేతనాలు, బకాయిలు

Published Date :March 21, 2022 , 6:16 pm
By NTV WebDesk
USPC Agitations: విడుదల కాని వేతనాలు, బకాయిలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు కొస్తున్నా వేతనాలు, బకాయిలు విడుదల కాకపోవడం పట్ల యుఎస్పీసీ ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ బుధవారం డిటిఓ ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని యుయస్పీసీ తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సత్వర మంజూరు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఉపాధ్యాయులు, పెన్షనర్ల సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, జిపిఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్,పీఆర్సీ, డిఎ బకాయిలు తదితర వేలాది బిల్లులు ననెలల తరబడి ప్రభుత్వ ఆమోదం కోసం ఇ కుబీర్ లో పెండింగ్ లో ఉంటున్నాయి.

సంఘాల ద్వారా ప్రాతినిధ్యం చేస్తే కొన్ని బిల్లులు మంజూరు చేస్తున్నారు. గత మూడు వారాలుగా అవి కూడా నిలిపివేశారు. జిఓ 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయుల జనవరి నెల సప్లిమెంటరీ వేతనాలు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుండి ఉన్న బిల్లులను మార్చి 31వరకూ మంజూరు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిందని తిరస్కరించారు.

ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి సమీక్షించిన యుయస్పీసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ముందుగానే మెమోరాండమ్ సమర్పించింది. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరుతూ బుధవారం (మార్చి 23) మధ్యాహ్నం 3.30 కు జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో పాల్గొనాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrears
  • GO 317
  • Teachers
  • telangana
  • treasury

తాజావార్తలు

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

  • Vivo Y11 5G, Vivo Y21 5G: వివో Y11 5G, వివో Y21 5G రిలీజ్ కు రెడీ.. కీ డీటెయిల్స్ ఇవే

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions