Yogi Adityanath : గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పరం అవుతుంది
UP CM Yogi Adityanath Speech at BJP Vijaya Sankalpa Sabha
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగిశాయి. అయితే ఈ నేపథ్యంలోనే పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన అతిరథమహారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ..
రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పరం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహం చూపారని, తెలంగాణలో బీజేపీ నేతల ఉత్సాహం చూస్తుంటేనే త్వరలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం
డబుల్ ఇంజన్ సర్కార్ యూపీలో వచ్చిందన్నా యోగి ఆదిత్యనాథ్.. కార్యకర్తల ఉత్సాహం మాకు ఉత్సాహానిస్తోందన్నారు. తెలంగాణలో కమల వికాసం ఖాయమని, ఎలాంటి సందేహం లేదన్నారు. తెలంగాణలో కేంద్రం పథకాలు అమలు కావడం లేదని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోందని, బీజేపీ బలం ఏంటో చూపిద్దామన్నారు. జై హింద్.. జైజై శ్రీరాం అంటూ ప్రసంగం ముగించారు యూపీ సీఎం యోగి.
తాజావార్తలు
-
Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ
-
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
-
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?