8 ఏళ్లుగా కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయం రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని పేర్కొన్నారు. అన్యాయాలు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారిందని విమర్శించారు. అబద్దానికి పెద్ద బిడ్డ టీఆర్ఎస్ అంటూ ఎద్దేవ చేసారు. భారీ వర్షాలు వచ్చినా కేసీఆర్ కి పట్టింపులు లేవని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వచ్చే జన్మలో కేంద్ర రాజకీయాల గురించి ఆలోచించు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉందా ? అంటూ ప్రశ్నించారు. దళిత బంధు తో పాటు గిరిజన, బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్ చేసారు. 8 ఏళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ జెండా కింద ఉన్నవాళ్లు.. తెలంగాణ ను వ్యతిరేకించిన వాళ్లే అంటూ విమర్శించారు.
read also: Atchannaidu: వైసీపీ అరాచకాలు చూసి చంద్రబాబే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
సామాజిక న్యాయం లేదు… అంత కుటుంబ పాలనే అంటూ మండిపడ్డారు. తెలంగాణలో సచివాలయమే లేదు, అసలు 8 ఏళ్లుగా కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయం రాలేదని ఎద్దేవ చేసారు కిషన్ రెడ్డి. నెలలో 20 రోజులు ఫార్మ్ హౌస్ లోనే ఉంటారు .. ప్రగతి భవన్ లో 10 రోజులు ఉంటే 8 రోజులు మోడీ నే తిడతారు అంటూ ఎద్దేవ చేసారు. ప్రజలను కేసీఆర్ కలవరు. కేంద్రం పై కుట్రలు చేయడానికి టైం ఉంటుంది. కానీ.. ప్రజలను కలవడానికి సమయం ఉండదని పేర్కొన్నారు. సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, ఈడీ లు, సీబీఐల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రగతి భవన్ నుంచి ఎందుకు గెంటేశావ్? అంటూ ప్రశ్నించారు. కల్వ కుంట్ల కుటుంబ పాలన ను తెలంగాణ ప్రజలు పాతర వేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.