Kishan Reddy : రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. కేంద్రంపై టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పుడు బియ్యంగా మార్చకుండా కేంద్రానికి బియ్యం ఇయ్యండని, నూకల చార్జీ మీరు భరించండి.. నూకల వల్ల వచ్చే నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా.. నూకల వల్ల చాలా తక్కువ నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆయన ఆయన వ్యాఖ్యానించారు.
రైతుల విషయంలో రాజకీయం ఎందుకు అంటూ ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ కేంద్రంపై చేసే దుష్ప్రచారాలను రైతులు నమ్మలేదంటూ.. కేసీఆర్ మాట్లాడిన వీడియోలను కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో చూపించారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, కేంద్రానికి అగ్రిమెంట్ ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రం సేకరించను అంటుందని ఆయన మండిపడ్డారు. రైతులను ఆగం చెయ్యటం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రా రైస్ చివరి గింజ వరకు కేంద్రం కొంటుందని, టార్గెట్ కంటే ఎక్కువ కొన్నామని, తెలంగాణకు ఒక విధానం, దేశానికి ఒక విధానము లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం ఉందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇదే విధానము ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులను రెచ్చకొట్టటం కోసమే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండని, ధాన్యం సేకరణలో కేంద్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వెయ్యలేదని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ది రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
https://ntvtelugu.com/bandi-sanjay-demanded-bc-reservations/
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!