Kishan Reddy Padayatra: కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy Padayatra: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రజలు, స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. ఇక రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తారు. అయితే.. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తుకారంగేట్ బస్తీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు.
గతంలో నేను రాసినలేఖకు స్పందించి తెలంగాణలో గేట్ పరీక్షాకేంద్రాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్న @EduMinOfIndia శ్రీ @dpradhanbjp గారికి,గేట్-2023 పరీక్షలనిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
విద్యార్థులు ఇకపై పూర్తిసమయాన్ని పరీక్షలకు సన్నద్ధంఅవటంపై కేటాయించి మంచిఉత్తీర్ణత సాధించాలనికోరుతున్నాను. pic.twitter.com/jtWBxSD4aW
— G Kishan Reddy (@kishanreddybjp) November 26, 2022
తెలంగాణ రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు నిన్న(26)న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని ఈ క్రమంలోనే గేట్-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లోనే గేట్ పరీక్ష నిర్వహించేవారు. ఈ సందర్భంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!