రామప్ప దేవాలయం అభివృద్ధి చేస్తాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు.
చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి ద్వారానే అద్భుత కట్టడం అని చెప్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు.
Also Read
కరోనా వచ్చినప్పుడు మందుల కోసం ఇతర దేశాల వైపు చూశారు. కానీ మనం మంత్రం వేరే దేశాల వైపు చూడలేదు. యువత మేధావి మీదా నమ్మకం పెట్టుకొని స్వదేశం లో వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం.అంతే కాదు ఈరోజుకు 100 కోట్ల డోసులు ప్రజలకు ఇచ్చాం. ఇక నుండి 12 ఏళ్ల వయస్సు వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామన్నారు. రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ లోని ఆలయాలు.. టూరిజం అభివృద్ధి చేశామన్నారు.
వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి కి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి.. అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా కారణంగా విదేశీ టూరిస్టులు రావడంలేదు. కరోనా తగ్గుముఖం పట్టడం తో విదేశీ టూరిస్టులు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారన్నారు మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా వుందని, ఎయిర్ పోర్టు వస్తే టూరిజం మరింతగా పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తక్కువ ఛార్జీలతో వరంగల్ కి విమానాలను నడుపుతామని, ఉడాన్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా రాయితీ ఇస్తామన్నారు మంత్రి కిషన్ రెడ్డి. అంతకుముందు ములుగులో గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!