సీఎం కేసీఆర్ రేపు సభ పెట్టుకున్న, సభలో కూర్చీవేసుకుని కూర్చున్న భయపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. TRS సభ పెట్టుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు బీజేపీనీ బద్నాం చేయడం టీఆర్‌ఎస్ పార్టీ కి అలవాటే అని విమర్శించారు. 8 యేళ్ళుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్ లాగా కుటుంబ పార్టీ కాదని, అవినీతి పార్టీ కాదని స్పష్టం చేశారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం కేసీఆర్ కి అలవాటే అని విమర్శించారు. కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫార్మ్ హౌస్ లో వేసుకుంటారని తెలిపారు.
రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కు మూడు అసెంబ్లీ లే కనిపిస్తాయని ఎద్దేవ చేశారు. గజ్వేల్ లో సీఎం కొడుకు, సిరిసిల్లలో ఆయన అల్లుడి హరీష్ రావు నియోజక వర్గాలే అని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ అమరుల శవాల మీద కుర్చీలు వేసుకుని తెలంగాణను పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే హీరోల మని వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎమ్మేల్యే లను జీరో లు చేశారని మండిపడ్డారు. హుజూరబాద్.. మునుగోడులో రిపీట్ కాబోతుందని కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారని తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పీడ, దరిద్రం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రేపు సాయంత్రం 3 గంటలకు మునుగోడులో సమర భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామన్నా అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు అబివృద్ధికై రాజీనామా చేసి బీజేపీ లో చేరుతున్నాడని, కేంద్ర మంత్రి అభిత్ షా ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. రేపు బీజేపీ బహిరంగ సభను ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవు రాజగోపాల్ రెడ్డి అమిత షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ లాగా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి తరలిచ్చే అలోచన లేదు, అలా చేయం ఒక్క ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి వచ్చి విజయం వంతం చేయాలని పిలుపు నిచ్చారు. మునుగోడు లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరు స్వచ్ఛందగా బహిరంగ సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.
India Vs Zimbabwe: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఫీల్డింగ్‌కే కేఎల్ రాహుల్ మొగ్గు
