NTV Telugu Site icon

Kishan Reddy: స్వప్న లోక్ ఘటన.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్‌ ను ఇవాల కిషన్‌ రెడ్డి వెళ్లారు. అక్కడున్న పరిస్థితులను ఆరా తీసారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను సీఎం కేసీఆర్‌కి లెటర్ కూడా రాశానని గుర్తు చేశారు. ఇప్పటికైనా గోదాంలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Read also: Shocking Decision: పెళ్లైన గంటల వ్యవధిలోనే వధువు షాకింగ్ నిర్ణయం.. ఏం చేసిందంటే?

జనావాసాల మధ్య గోదాంలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. Ghmc రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి కానీ.. ఆదాయం వేట లోనే ఉంటుందని ఆరోపించారు. ఆదాయం కోసం ఇల్లీగల్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Q net లాంటి సంస్థల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. తూతూమంత్రంగా కమిటీలు వేసి నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి మానుకోవాలని అన్నారు. స్వప్న లోక్ ఘటనలో చనిపోయిన వారికి కేంద్రం తరఫున కూడా నష్ట పరిహారం చెల్లించాలని, ప్రధాన మంత్రిని కోరానని, ఒక్కొక్కరికి 2 లక్షలు చెల్లించేలా ఒప్పుకున్నారన్నాని తెలిపారు.

అనంతరం హెల్తి బేబీ షో కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పెద్ద పిల్లలు, పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఇలాంటి హెల్తి బేబీ షో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ, వెళ్ళనేస్ సెంటర్స్, అయుష్మన్ భారత్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లల తల్లిపాలు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం ఉన్నట్లే అని తెలిపారు. రానున్న రోజుల్లో మోడీ నాయకత్వంలో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు.
MLC Jeevan reddy: జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రోళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారు

Show comments