వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు.