Hair Growth: జుట్టు చివర్లను కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hair Growth: పొడవాటి, అందమైన, నల్లటి జుట్టును ఎవరు కోరుకోరు? అయితే ఈ రోజుల్లో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. వాయు కాలుష్యం, కెమికల్స్ షాంపూలు, నూనెలు, డీహైడ్రేషన్, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం, జుట్టు చిట్లడం, గరుకుగా మారడం వంటి సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించుకుంటే పొడవుగా పెరుగుతుందని భావించే వారు చాలా మంది ఉన్నారు.
Read also: Viral Video: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో తాతయ్య రచ్చ.. మంచి రొమాంటిక్ డైరెక్టర్ అయ్యేవాడేమో..!
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
కటింగ్ వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా?
ఇలా నెలకో రెండు, మూడు నెలలకో ఒకసారి కచ్చితంగా జుట్టు కత్తిరించేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా జుట్టు కత్తిరించుకుంటే పొడవుగా పెరుగుతుందని అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు కత్తిరించడం వల్ల అది అస్సలు పెరగదు. జుట్టు పెరగడం అనేది కేవలం మన భ్రమ మాత్రమేనని నిపుణులు తేల్చారు. జుట్టు కత్తిరించడం, దాని పెరుగుదల మధ్య ఎటువంటి సంబంధం లేదని నిపుణులు నిర్ధారించారు. ఎందుకొ మీకు తెలుసా? జుట్టు ఫోలికల్స్ నుండి మాత్రమే పెరుగుతుంది. అంటే నెత్తిమీద నుంచి. అదే జుట్టు చివర్ల నుండి కాదు. అందుకే మీ జుట్టును కత్తిరించడం వల్ల అది పొడవుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుందనేది పెద్ద అపోహ. నిజానికి జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. అది చక్కని ఆకృతి. మన జుట్టు నెలకు 1 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుందని మీకు తెలుసా? కానీ జుట్టు కూడా అప్పుడప్పుడు పాడవుతుంది. అలాగే మనం రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం చాలా సహజం. వెంట్రుకల జీవితకాలం ముగియడంతో, అవి రాలిపోయి కొత్తవి పుడతాయి. కానీ చివర్లను కత్తిరించడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు తొలగిపోతుంది. జుట్టు అందంగా మారుతుంది.
Read also: BIG Breking: చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్ పడటంతో నలుగురు మృతి
జుట్టు కత్తిరించుకోకూడదా?
హెయిర్ కటింగ్.. కురుల ఎదుగుదలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ట్రిమ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీకు పొడవైన అందమైన జుట్టు కావాలంటే ఇది చాలా ముఖ్యం. పగిలిన, దెబ్బతిన్న జుట్టును కత్తిరించడం వలన మీ జుట్టు ఆరోగ్యంగా.. మందంగా కనిపిస్తుంది. జుట్టు కత్తిరించడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.. అయితే ఎన్ని రోజులు జుట్టు కత్తిరించుకోవాలి? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెగ్యులర్ హెయిర్ ట్రిమ్మింగ్ మీ హెయిర్ కేర్ రొటీన్‌లో భాగంగా ఉండాలి. ఎందుకంటే దీని వల్ల జుట్టు సమస్యలు రావు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ ఫ్రీక్వెన్సీ మీ జుట్టు రకం మరియు జుట్టు శైలిపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టు బాగా ఒత్తుగా ఉంటే, మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి కత్తిరించాలని నిపుణులు అంటున్నారు. కానీ జుట్టును ఎప్పుడు కత్తిరించాలనే దానిపై ఎటువంటి నియమం లేదు. అయితే అవి ఎంతకాలం కావాలనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మీరు 3-4 నెలలకు ఒకసారి మీ జుట్టును కత్తిరించుకోవచ్చు. అయితే, ఎంత జుట్టు కత్తిరించినా తిరిగి పెరుగుతుంది.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
తాజావార్తలు
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?