Two Woman Arrested In Hyderabad Who Vandalised Durga Idol In Burkha: హైదరాబాద్‌లో నవరాత్రి ఉత్సవాల్లో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు.. ఖైరతాబాద్‌లో దుర్గా మాత మండపంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సింహం విగ్రహం తల భాగం పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు వారిని అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన మహిళలు బుర్ఖా ధరించడం ఉండటంతో.. ఇది మత సంఘర్షణలు దాడి తీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. ఆ మహిళలకు మతిస్థిమితం లేదని గుర్తించారు.
ఈ వ్యవహారంపై సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ మాట్లాడుతూ.. సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో దుర్గా మాత విగ్రహంపై దాడి చేసిన మహిళల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. దర్యాప్తులో ఆ ఇద్దరికి మతిస్థిమితం లేదని గుర్తించామన్నారు. విచారణలో భాగంగా.. ఆ మహిళలు సైపోతేమియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. మెడికల్ రిపోర్ట్స్‌ని వెరిఫై చేస్తున్నామన్నారు. ఇరుగు పొరుగు వారిని సైతం విచారించామని, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని తెలిపారు. ఆ ఇద్దరు మహిళల సోదరుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇచ్చాడన్నారు. నాలుగు సంవత్సరాత క్రితం కూడా ఆ మహిళలు ఇలాగే ప్రవర్తించారని.. అప్పుడు చర్చిల్లో విగ్రహాల్ని సైతం ధ్వంసం చేసినట్టు తేలిందని చెప్పారు.
ఈ కేసులో ముడు టీమ్స్ సిద్ధం చేశామని, పూర్తి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు. ఇందులో ఏవేవో పుకార్లు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని ఎవ్వరూ నమ్మకండని పిలుపునిచ్చారు. ఐపిసి సెక్షన్ 153(a), 295 & 295(a), 451, 504, 34(r) కింద కేసు నమోదు చేసుకుని చేస్తున్నామన్నారు. ఆ ఇద్దరు మహిళల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి, గౌరవ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ రాజేష్ వెల్లడించారు.