కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైదరాబాద్ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460 కోట్ల పైగా రుణాలు తీసుకున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ… గత కొన్ని ఏళ్లుగా వాయిదాలు చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.
read also : పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా?
Also Read
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.329 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకులో 137 కోట్లు బకాయి తీసుకుంది కార్వి.2019లో కార్వీ సంస్థపై ఫిర్యాదు రావడంతో… కార్వీ లావాదేవీలు పై విచారణ జరిపి నిషేధం విధించింది సెబీ. వినియోగదారులకు చెందిన షేర్లను కార్వీ సంస్థ సొంత అవసరాలకు వాడుకుంది. అయితే.. తాజాగా కార్వి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!