Tummala: నేడు అనుచరులతో తుమ్మల భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala: పాలేరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మల ఈరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు. క్యాంపు కార్యాలయంలో అనుచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. కానీ.. తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? మరి వీరు ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది. ఇక మరోవైపు కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మల అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేతలు కూడా తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో అనుచరులతో భేటీ కానున్న తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటిస్తారా? లేక మరేదైనా వ్యూహం ఉందా? అనేది చూడాల్సి ఉంది.
Read also: ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను శాంతింపజేసేందుకు గులాబీదళం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. తుమ్మల ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. తుమ్మల అభిమానులు కూడా ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతూ…కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. అయితే.. ఇవాళ అనుచరులతో భేటీ అనంతరం పార్టీ మార్పుపై తుమ్మల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆయన ఉండడం కూడా పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తుమ్మల, రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పట్లో టీడీపీలో కీలక నేత. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తుమ్మల కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Hyderabad: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. కఠిన నిర్ణయం తీసుకున్న భర్త..!
అయితే తుమ్మల పాలేరు టిక్కెట్టు ఆశిస్తున్నారు. మరోవైపు.. షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియ కూడా పూర్తి కానుంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే పాలేరు నుంచి పోటీ చేస్తానన్నారు. మరోవైపు షర్మిల కూడా పాలేరు స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పాలేరు సీటు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డితో భేటీకి తుమ్మల అంగీకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ టికెట్ ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవకాశం మేరకు ఖమ్మంలో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తుమ్మలకి రేవంత్ చెప్పినట్లు సమాచారం. ఖమ్మంలో పోటీకి సిద్ధమైతే ఎన్నికల ఖర్చు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు వినికిడి. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తుమ్మలను కోరుతున్నట్లు ప్రచారం జరిగినా.. పాలేరు మినహా మరెక్కడా పోటీ చేసే ఆసక్తి లేదని తుమ్మల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని, సీటు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.
Anasuya : గోల్డ్ శారీలో మెరిసిన అనసూయ..
- Tags
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!