Tummala-Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ..
- ఐదు గ్రామాల విలీనంపై కీలక చర్చలు
- భద్రాచలం కరకట్ట, పెద్దవాగు ప్రాజెక్ట్ అంశాలు
- 85:15 నిష్పత్తిలో వ్యయభారం ప్రతిపాదన
- తిరుమల వసతి, రైల్వే లైన్లపై విజ్ఞప్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. ఈ గ్రామాలు ఏపీకి ‘ఎంక్లేవ్’లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని, అందువల్ల పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
దీంతో పాటు భక్తుల భద్రత , సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతినడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఏపీ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణ సమస్యలు వస్తున్నాయని, తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం అయ్యే రూ.92.20 కోట్ల వ్యయాన్ని రెండు రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
చివరగా ఆధ్యాత్మిక , మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక విజ్ఞప్తులు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటు, ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చేసిన ఈ ప్రతిపాదనల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో, సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , భక్తుల సౌకర్యాల విషయంలో త్వరలోనే వేగవంతమైన పురోగతి లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!