ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు తుమ్మల నాగేశ్వరరావు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలతో రాజకీయాల్లో నిలిచారు. కుటుంబాన్ని అనుచరులను పక్కన పెట్టి జిల్లా అభివృద్ది కోసం ఆయన కృషిచేశానంటున్నారు. కేసీఆర్ సారథ్యంలో 15 వేల కోట్ల తో సీతారామ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారన్నారు. తెలుగుగంగ, శ్రీరామ సాగర్ ప్రాజెక్టులలో నా భాగస్వామ్యం ఉంది. చంద్రబాబునాయుడు హయాంలో కూడా అభివృద్ది చేశానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పది లక్షల ఎకరాల్లో సాగు నీటిని ఇచ్చే పథకాలు కొనసాగుతున్నాయి. నేలకొండపల్లి మండల టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఏ పార్టీ నుంచి పోటీచేసిన టిడిపి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Read Also: Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. గోవా గడ్డపై తెలుగోడు గర్వించేలా మాట్లాడిన చిరు
స్వర్గీయ ఎన్ టి రామారావు ఇచ్చిన అవకాశాల వల్లనే తాను ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తనకుటుంబాన్ని , తన అనుచర గణాన్ని పక్కన పెట్టి జిల్లా అభివృద్ది కోసం కృషి చేశానని తుమ్మల అన్నారు.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్బంగా మండ్రాజుపల్లి, కొత్తూరు గ్రామంలో టిడిపి క్యాడర్ తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈసందర్బంగా తుమ్మల మాట్లాడుతు తాను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్ చేదోడుగా నిలిచారని ఎమోషనల్ అయ్యారు.
ఎన్ టిఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా తనని ఆహ్వానించడం పట్ల ధన్యవాదాలు చెప్పుతున్నానని తుమ్మల వారి నుద్దేశించి అన్నారు. అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ సాగు చేసిన ఘనత తనకు పాలేరు లోనే దక్కిందని చెప్పారు. నేలకొండ పల్లి మండల కమిటీ సమావేశం మండ్రాజుపల్లి, కొత్తూరు లతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈసందర్బంగా టీడీపీ మండల కమిటీ తుమ్మలకు మద్దతు పలికింది. తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీచేస్తానన్న ఆయనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ మండల కమిటినిర్ణయించింది. ఎన్టీఆర్ సాక్షిగా గెలిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల చాలా సంతోషం కలిగిందని తుమ్మల అన్నారు.
Read Also: Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలడా?