NTV Telugu Site icon

TSTDC: భక్తులకు టీఎస్ టీడీసీ గుడ్ న్యూస్.. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ..

Untitled 5

Untitled 5

Telangana: ఆ పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం అని హిందువుల నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు భక్తులు. అలానే పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడానికి కూడా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో టీఎస్ టీడీసీ భక్తులకు ఓ శుభవార్త చెప్పింది. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ని నిర్వహించనుంది. వివరాలలోకి వెళ్తే.. కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టిందని.. దీనిలో భాగంగా తెలంగాణ లోని ప్రముఖ దేవాలయాల దర్శనం తో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కూడా ఉంటుందని తెలిపారు.

Read also:Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు

కాగా ఆహారం, అలానే ప్రవేశ టికెట్లకు అయ్యే ఖర్చులు ఎవరికీ వారు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కోసం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరుతుందని తెలిపిన ఆయన తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దవాళ్లకు 4999 అలానే చిన్న పిల్లలకు 3999 అని వెల్లడించారు. అలానే శాతవాహన రీజియన్ పరిధి లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాల దర్శనానికి శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు బస్సు బయలు దేరుతుందని.. తిరిగి రాత్రి 10 గంటలకు బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దలకు 1999 కాగా చిన్నారులకు 1599 అని వెల్లడించారు. కాకతీయ రీజియన్ పరిధిలోని శైవ క్షేత్రాలతో పాటుగా ఇతర దేవాలయాల దర్శనానికి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు 9848540371, 9848007020, 9848306435, 9848007031, 9848125720 నెంబర్లను సంప్రదించాల్సిందగా కోరారు.

Show comments