TSRTC Good News: దసరా పండుగ సంబురాలు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి వారి వారి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం, తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ గత కొన్ని నెలలుగా సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు కట్టిపడేస్తుంది సంగతి తెలిసిందే. పండుగలు వచ్చినప్పుడల్లా ప్రయాణికుల కోసం ప్రవైట్ ట్రావెల్స్ కు ధీటుగా ఆఫర్లను తీసుకొస్తు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా పండుగలకు ఆనందంగా ఇంటికి చేరుకునేలా చూస్తుంది.
వారం రోజుల్లో దసరా వస్తున్న సందర్బంగా.. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మరో నిర్ణయం తీసుకుంది టీఎస్ ఆర్టీసీ. సెప్టెంబర్ నెల 26 వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానుండగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు 4 వేల బస్సుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది.. గత ఏడాది ఈ సమయంలో 3300 బస్సుల వరకు నడిపింది. ఇక ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే, బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా సిద్ధం అవుతోంది.
Karnataka: రూ. 9 వేల కోసం వ్యక్తి దారుణ హత్య