VC Sajjanar: మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకం.. త్వరలో 2050 కొత్త బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది.
Also Read: New criminal laws: మూకదాడికి పాల్పడితే ఇక మరణశిక్షే.. దేశద్రోహ చట్టానికి ఇక చెల్లు..
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చింది. అటువంటి ప్రయాణం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఇది ప్రమాదం. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదు. రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు’ అని పేర్కొన్నారు.
త్వరలో 2050 కొత్త బస్సులు
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నామన్నారు. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. . విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. ఆటో డ్రైవర్ల ఆందోళన ప్రభుత్వం దృష్టిలో ఉందని, వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో ఫైనల్స్ తరువాత అభిమానులు ఆర్టీసి బస్సు అందాలను పగలగొట్టిన ఘటనపై ఆయన మండిడ్డారు.
Also Read: Prithviraj Sukumaran: ప్రభాస్ లో నాకు అదే నచ్చలేదు.. చాలా డేంజరస్ పర్సన్
బిగ్‌బాస్-7 ఫైనల్ తర్వాత హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఆరు బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. బిగ్ బాస్ షో ఫైనల్స్ తరువాత కొందరు ప్రభుత్వ ఆస్థికి నష్టం కలిగించారని, అది నేరం.. అందుకే వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకున్నామన్నారు. వినోదం కోసం ఇలాంటి షోలు చూడండి.. కానీ ఇటువంటి చర్యలు మంచివి కాదని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!