మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల�