Sajjanar Fires on Girl Dance: రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయ్యేందుకు ఓ యువతి చేసిన రచ్చపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. నడిరోడ్డుపై ఈ వెర్రి చేష్టలు ఏంటంటూ ఫైర్ అయ్యారు. కాగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వల్ల యువత సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయ్యింది. లైక్స్, వ్యూస్ మోజులో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. కొత్తగా ట్రై చేసి ఫాలోవర్స్ పెంచుకోవడం అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కుతున్నారు. రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఫాలోవర్స్, వ్యూస్ కోసం ఓ యువతి చేసిన రచ్చ ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కే అసహనం తెప్పింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ యువతి నడిరోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Also Read: Bengaluru: బెంగళూర్‌లో దుకాణాల సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడలో ఉండాల్సిందే..
ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై పడుకుని డ్యాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించింది. రద్దీగా ఉన్న ఓ రోడ్డు మధ్యలోకి ఓ అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తన కాలేజీ బ్యాగ్‌ను పక్కకు పడేసింది. వెంటనే రోడ్డుపై పడుకుని స్టెప్పులు వేసింది. అప్పటికే సిగ్నల్ పడి ఉండటంతో అక్కడ ఉన్న వాహనదారులంతా ఆమెను వింతగా చూడటం ఈ వీడియోలో కనిపించింది. 23 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే వీడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేశారు. ‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం చాలా బాధాకరం. సమాజానికి పనికొచ్చే పనులు చేసి నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్‌మీడియా మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడిరోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యం కల్పించడం ఏం ఆనందమో’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: Chandrababu: వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావు..
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023