TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేడు హైకోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.
Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
Also Read
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ వైపు సిట్, మరోవైపు ఈడీలు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. వారి ద్వారా అందులో భాగమైన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న వాదనలు జరిగాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. 24న జరిగిన వాదనల్లో.. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తూ.. సీబీఐకి ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కోణాల్లో దర్యాప్తు చేసే సత్తా సిట్‌కు లేదన్నారు. అయితే… పిటిషనర్ల వాదనతో ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకీభవించలేదు. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతోందని, సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీల్డ్ కవర్లో సిట్ సమర్పించిన నివేదికతో పాటు ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?