TSPSC: తీగ లాగితే డొంక కదిలినట్లు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతుంది. పేపర్ లీక్‌లో వున్న నిందితులందరినీ విచారిస్తున్న సిట్ కు రోజుకో లింక్ లు బయటకు వస్తున్నాయి. ఇవాల Tspsc పేపర్ లిక్ కేసులో నలుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. ఏ-1ప్రవీణ్, ఏ-2రాజశేఖర్, ఏ-4 డాక్య, ఏ-5 కేతావత్ రాజేశ్వర్ లను సిట్ రెండవ సారి కస్టడీలోకి తీసుకోనుంది. హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయంలో నేటి నుండి మంగళవారం వరకు కస్టడీ విచారణ జరగనుంది. నలుగురు నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు రాబట్టవచ్చని సిట్ దర్యాప్తు బృందం భావిస్తుంది. షాద్ నగర్ మండలం నేరెళ్ళ చెరువులో రాజేంద్ర కుమార్ అనే యువకుడిని సిట్ అరెస్ట్ చేసింది. రేణుక భర్త డాక్య నాయక్ వద్ద పేపర్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. ఉపాధి హామీలో పని చేస్తున్న మరో ముగ్గురు ఉద్యోగులకు పేపర్ అమ్మకం చేసినట్లు గుర్తించారు.
Read also: Kiran Abbavaran: మార్చ్ 29న మాస్ ‘మీటర్’ ఎంతో చూపించబోతున్నాడు
నిందితులందరినీ మరోసారి విచారించాలని కోరుతూ సిట్ అధికారులు శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినవిషయం తెలిసిందే.. నిందితురాలు రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్ ఏఈ పేపర్‌ను ఆశావహులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. ఇక.. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో.. ప్రశాంత్‌రెడ్డి నవాబ్‌పేట్ మండలం ఉపాధి హామీ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా.. వికారాబాద్ జిల్లా డీఆర్డీఏలో పని చేస్తున్న ఢాక్యానాయక్ ప్రశాంత్‌రెడ్డికి పరిచయమయ్యాడు. మార్చి 5న జరిగిన ఏఈ పేపర్‌ను రెండ్రోజుల ముందుగానే ప్రశాంత్‌కు అందించినట్టు తెలుస్తుంది.దీంతో.. మహబూబ్‌నగర్‌లోని రేణుక ఇంట్లో ప్రశాంత్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రూ.7.5 లక్షలు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు.కాగా.. ప్రశాంత్‌తోపాటు మరో ఐదుగురికి ఏఈ పేపర్ షేర్ చేసినట్టు సిట్ అధికారులకు ఆధారాలు దొరికాయి. ఈనేపథ్యంలో.. మహబూబ్‌నగర్ ఎంపీడీవో ఆఫీసులో ఇద్దరు ఉద్యోగులు.. షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి ఏఈ పేపర్లను లక్షల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. ఇక మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ప్రశాంత్ వాంగ్మూలంతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అయితే.. తొమ్మిది మంది నిందితులను కస్టడీలో విచారించినప్పుడు ఎవరు కూడా నోరు మెదపలేదని.. ఇద్దరు మాత్రమే మరో ఇద్దరి పేర్లు చెప్పారని సిట్ పిటిషన్‌లో వివరించింది. ఇక ఏడుగురు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ అధికారులు కోరిన విషయం తెలిసిందే..
Mem Famous Teaser Launch Event Live: మేం ఫ్యామస్ మూవీ టీజర్ లాంచ్ లైవ్