Site icon NTV Telugu

Big Breaking: ఎమ్మెల్యేల ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

Trs Mlas Poaching Case A

Trs Mlas Poaching Case A

TS High Court: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశం. రూ.3లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు. ముగ్గురూ మూడు రూ. 2 లక్షలు మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తు సమర్పించాలి. ముగ్గురి పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని ఆదేశించింది.

Read also: Vishwak Sen: ఒక్క ట్రైలర్ లో ఇన్ని ట్విస్ట్ లు ఏంటి బ్రో?

మరోవైపు కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ నిరాకరించాలని కోర్టును కోరారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముగ్గురికి బెయిల్ వచ్చినా ఈరోజు సింహయాజీ మాత్రమే బయటకు రానున్నారు. రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో వీరిద్దరూ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

Read also: Crime News: లోన్ యాప్ వేధింపులు.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Exit mobile version