ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మగ్గిపోతున్న ఉద్యోగులకు తెలంగాణ ఆర్థిక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆశలు విరబూసాయి. అయితే 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపించాలని కోరిన ఆర్థిక శాఖ కోరింది.