NTV Telugu Site icon

TS EAPCET 2024: అలర్ట్… తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు..!

Ts Eapset Shedul Chaing

Ts Eapset Shedul Chaing

TS EAPCET 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అలాగే ఐసెట్ పరీక్షను ఒకరోజు వాయిదా వేశారు. మునుపటి షెడ్యూల్ ప్రకారం, APSET పరీక్షలు మే 9 నుండి 12 వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనుండగా.. పరీక్షకు, ఎన్నికల తేదీకి మధ్య ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది.

Read also: Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు సెలవులు! ఎప్పుడంటే..?

ఈనేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎప్‌సెట్‌ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4,5న ఐసెట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో ఐసెట్ పరీక్షను ఒక్కరోజు ఆలస్యంగా నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.

Read also: Moscow Attacks: ఉగ్రదాడిపై రష్యాకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ..!

TS EAPCET 2024 తేదీలు: ముఖ్యమైన తేదీలు

* ఫిబ్రవరి 21 – నోటిఫికేషన్ విడుదల

* ఫిబ్రవరి 26 నుండి ఏప్రిల్ 6 వరకు – ఆన్‌లైన్ దరఖాస్తులు

* ఏప్రిల్ 8 నుండి 12 వరకు – ఎడిట్ ఎంపిక

* మే 1 నుంచి – హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్

* మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.

* మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు

Read also: Rampachodavaram: మన్యంలో పుష్ప సీన్ రిపీట్..!

ఐసెట్ షెడ్యూల్ కూడా మార్చబడింది..

* తెలంగాణ ఐసెట్ 2024 నోటిఫికేషన్ – మార్చి 5,2024.

* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం – మార్చి 7, 2024.

* ఆలస్యం లేకుండా ఏప్రిల్ 30, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తు ఆమోదం – మే 17, 2024.

* రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు ఆమోదం- మే 27, 2024.

* పరీక్ష తేదీలు – జూన్ 5, 5 -2024.

* అధికారిక వెబ్‌సైట్ – https://icet.tsche.ac.in
Moscow Attacks: ఉగ్రదాడిపై రష్యాకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ..!