TS Cabinet Meeting: నేడు కేబినెట్ భేటీ.. పలు అంశాలపై మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Cabinet Meeting: ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6 తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఈసమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఇక విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్లో ఈ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో శాసనసభలోనూ ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ సీబీఐకి అనుమతి ఉండరాదని ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఇక జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాల్సి ఉన్న తరుణంలో అందుకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదంతో పాటు మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనేపథ్యంలో.. నీటి పారుదల ప్రాజెక్టులకు కొన్ని ప్రాజెక్టుల అంచనాలు, సాంకేతిక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక మండలి కోసం చట్ట సవరణ బిల్లు కూడా కేబినెట్ ముందుకు రానుంది. తెలంగాణలో దళితబంధు పథకం అమలు పురోగతిపై కూడా కేబినెట్ సమీక్షించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Colombia: పోలీసు వాహనంపై బాంబు దాడి.. 8 మంది అధికారులు మృతి
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!