TS Cabinet Meeting: ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6 తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఈసమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఇక విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.…